
ప్రపంచం చీకటిని వెలుగుగా భ్రమిస్తూముందుకు పోతోంది.మా ఆశ్రమంలోవెలుగుదారులు విరబూస్తున్నాయి.సాధనాసమ్మేళనంలో జరిగిన సమావేశాలలో ముఖ్యంగా కొన్నింటిని ఇక్కడ పరిచయం చేస్తున్నాను.జ్యోతిషసమ్మేళనంవారం రోజులలో జరుగబోతున్న శనీశ్వరుని రాశిమార్పు యొక్క ఫలితాలను శిష్యులకు వివరించాను. అదేసమయంలో అమావాస్య జరుగుతున్నది. జనజీవనంలో ఇది చాలా మార్పులను తెస్తుంది. చాలామందికి కోలుకోలేని దెబ్బలు తగులబోతున్నాయి. శిష్యులలో...