“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జనవరి 2009, శనివారం

కాల సర్ప యోగం

ఈ మధ్య జ్యోతిషంలో అతి వివాదాస్పద విషయాలలో కాల సర్ప యోగం ఒకటిగా తయారైంది. అసలు ఈ యోగాన్ని గురించి నాకు తెలిసినంత వరకు వరాహాచార్యుడే చెప్పింది. ముఖ్యంగా చెప్పబడే శ్లోకం ఆయనదే.
శ్లో||అగ్రే రాహు రధో కేతు మధ్యే సర్వ గ్రహా యది
కాల సర్పాఖ్య యోగోయం రాజా రాష్ట్ర వినాశనం.
ప్రామాణిక గ్రంథాలలో ఎక్కడా ఇది వ్యక్తిగత జాతకాలలో పని చేస్తుందని చెప్పలేదు. దీనిని ఈ మధ్య కొందరు వక్రీకరించి నాగుల పేర్లకు దీనికి ముడిపెట్టి తక్షక యోగమని, కర్కోటక యోగమని ఇలా చెబుతున్నారు. బి వి రామన్ గారు తన త్రి హండ్రెడ్ ఇంపార్టెంట్ కాంబినేషన్స్ అనే పుస్తకంలో ఈ యోగాన్ని చర్చిస్తూ దీనికి అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదన్నారు. సామాన్యంగా ఈ యోగ జాతకులలో ఇతర దుష్ట యోగాలు కూడా ఉంటాయి. వాటిని బట్టి జాతకం ఉంటుంది కాని ఈ యోగం ఒక్కటే ముఖ్యం కాదు అంటారు. సంజయ రథ్ గారు, జగన్నాథ హోర సాఫ్టు వేర్ రూపకర్త నరసింహారావుగారు వారి రీసెర్చి లో ఈ యోగం కొన్ని సార్లు కాల అమృత యోగంగా మారి జాతకునికి గొప్ప ఔన్నత్యాన్ని ఇస్తుందని చెప్పారు. కాని నేను చూచిన జాతకాలలో ఈ యోగం చాల బాధలు పెట్టింది. దాదాపు నలభై రెండు ఏళ్ళు వచ్చేవరకు జీవితంలో స్థిరత్వం లేకుండా చేసిన జాతకాలు అనేకం. కాని దీనికి రెమెడీస్ అంటూ ఎక్కడా చెప్పలేదు. కొందరు అనేక హోమాలు, పూజలు చేసి దీన్ని తగ్గిస్తామని చెప్పుకుంటూ లక్షలు సంపాదిస్తునారు. పాము వచ్చి కనపడుతుందని అదే నిదర్శనమని అంటునారు. కాని నా అనుభవంలో ఈ యోగం తీసివేయడం చాలా కష్టం అనిపిస్తుంది. రాహు ముఖంలోకి గ్రహాలన్నీ ప్రయాణించడమే అసలైన కాల సర్ప యోగం. కేతువు వైపు ఉంటే అంత బలం ఉండదు దీనికి. కొందరు అసంపూర్ణ కాల సర్ప యోగమని కొత్త కొత్త మాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులు మోసపోతున్నారు. రాబోతున్నవి రాహుముఖ యోగాలు కాదు. కనుక పెద్దగా వాటి ప్రభావం ఉండదు. దానికన్నా ప్రమాదకరం జనవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి ఎనిమిది వరకు కుజుడు మకర రాశిలో ఇతర గ్రహాలతో ముఖ్యంగా రాహువుతో కలవడం. ఇది అనేక కుట్రలు, పేలుళ్లు, హింస, ప్రమాదాలకు కు దారి తీస్తుంది. మకరం దక్షిణాన్ని చూపుతుంది, భూ తత్వ రాసి కనుక దక్షిణ రాష్ట్రాలలో భూకంపాలు గాని, ప్రమాదాలు, కుట్రలు, పేలుళ్లు జరుగుతాయి. కాల సర్ప యోగాన్ని గురించి ఇంకా వివరంగా ముందు ముందు చూద్దాం.